నేను కేసీఆర్కు చాలా సార్లు ఫోన్ చేశా: గడ్డం ప్రసాద్ 1 d ago
TG: తాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు చాలా సార్లు ఫోన్ చేశానని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. మన్మోహన్ సింగ్ సంస్మరణ సభకు రావాలని కోరినా కేసీఆర్ రాలేదని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకానికి మా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల బాధలు చూసి తట్టుకోలేకపోతున్నానని గడ్డం ప్రసాద్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల పక్షపాతి అని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల వద్దకు తీసుకుపోవడంలో ఉద్యోగుల పాత్ర కీలకం అని గడ్డం ప్రసాద్ చెప్పారు.